Kakatiya Patrika

Posts under ‘తెలంగాణ పత్రిక’

కథలకు దిక్సూచి సుజాత – సంగిశెట్టి శ్రీనివాస్

Courtesy: thatstelugu.com
-సంగిశెట్టి శ్రీనివాస్
పత్రికల్లో కథలు అచ్చు కావడమనేది తెలంగాణలో 1913 నుంచే ఆరంభమైనా అది 1927లో సుజాత స్థాపనతో ఊపందుకుంది. 1923-24లో వరంగల్లు నుంచి వెలువడిన ఆంధ్రాభ్యుదయము కూడా కొన్ని కథలను ప్రచురించింది. నీలగిరి, తెనుగు పత్రికలు కూడా అప్పుడప్పుడు కథలు ప్రచురించాయి. తెలంగాణ సాహిత్యానికి ప్రోత్సాహమిచ్చే ఉద్దేశ్యంతో 1927లో స్థాపించిన సుజాతను మైలురాయిగా, దిక్సూచిగా