Kakatiya Patrika

కటంగూరి నరసింహారెడ్డి అస్తమించిన పోరాటాల యోధుడు

Courtesy: Andhra Prabha Newspaper

వరంగల్‌, ఆగస్టు 11(కెఎన్‌ఎన్‌ ప్రతినిధి): ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు నిజాం వ్యతిరేక సాయయుధ పోరాటానికి నిర్వహించిన ఉద్యమ కారుడు కటంగూరి నర్సింహ రెడ్డి మంగళవారం కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హన్మకొండలోని ఆయన స్వగృహంలో మృతి చెందిన వార్త సమర యోధులను, జిల్లాలోని జాతీయ వాదులను కుదుపి వేసింది. ఉద్యమకాలంలో చాందా క్యాంపుతో పాటు వరంగల్‌ కరీంనగర్‌ తదితర ప్రాంతంలో ఎన్నో పోరాటాలు నిర్వహించి నాయకత్వం వహించిన ఆయన స్వాతంత్య్రానంతరం కూడా ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారు. ఆయన మృతి పట్ల రాష్ట్ర మంత్రి శ్రీమతి కొండా సురేఖ, అధికారులు, అనాధికారులు, రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటించి హన్మకొండలో ఆయన మృత దేహాన్ని సందర్శించి ఘన నివాళ్ళర్పించారు. పేరు : కటంగూరు నర్సింహా రెడ్డి తండ్రి పేరు : కీ.శే. కంగూరు రమణా రెడ్డి పుట్టిన తేది : 16 అక్టోబర్‌ 1923 విద్యార్హత : ఇంటర్‌ మీడియెట్‌ జాతీయ కార్యదర్శి : సమతా పార్టీ ముఖ్య కార్య నిర్వాహాక కార్యదర్శి : ఆంధ్రప్రదేశ్‌ స్వాతంత్య్ర రసమర యోధుల సంఘం అధ్యక్షులు : స్వాతంత్య్ర సమరయోధుల జాతీయ సభ అధ్యక్షులు : అమరవీరుల స్మారక సంఘం అధ్యక్షులు : విశ్వ ప్రజా సేవా సమాజ్‌ ..రాజకీయ సమాజిక కార్యక్రముల… 193839 లో నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఆర్య సమాజ్‌ నిర్వహించిన పౌర హక్కుల ఉద్యమంలో జాతీయ విద్యార్థి సంఘం జనరల్‌ సెక్రటరీ గా క్రియా శీలపాత్ర నిర్వహించారు. పరకాలలో 1947 సెప్టెంబర్‌ 2న జరిపిన నిజాం పోలీసు కాల్పుల్లో రహస్యంగా పాల్గొన్నారు. ఈ కాల్పుల్లో 23 మంది సమర యోధులు నేలకొరగడం, 500 మంది కి పైగా గాయపడిన భీకర సంఘటన. ఇది మరో జలియన్‌ వాలాబాగ్‌ ను స్పూరిపచేసిన భయంకర సంఘటన. దీని తర్వాత అజ్ఞాతవాసం. చాందాక్యాంపులో గెరిల్లా శిక్షణ, నాగపూర్‌లో మిలటరీ శిక్షణను పొంది 194748 సంవత్సరంలో జరిగిన నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా, రజాకార్ల పై సాయుధ పోరాటంలో చురుకైన పాత్ర నిర్వహించారు. పోలీసు స్టేషన్‌ ల పై నిర్వహించిన దాడుల్లో పాల్గొనడం. సాయుధ పోరాటానికి కావలసిన ఆయుధాలు, మందుగుండు సామానుల సమీకరణ నిమిత్తం, ఆదిలాబాద్‌ జిల్లాలోని విర్రూర్‌, పారుపల్లి, కరీంనగర్‌ జిల్లాలోని రొంపి కుంట, మహాదేవ్‌ పూర్‌, వరంగల్‌ జిల్లాలోని చంద్రగిరి, బుద్దారం పోలీసు స్టేషన్‌ లపై నిర్వహించిన దాడుల్లో పాల్గొనడం. లోక్‌ నాయక్‌ జయప్రకాశ్‌ నారాయణ మార్గదర్శకత్వంలో చంద్రగిరి కొండల్లో నెలకొల్పన గెరిల్లా యుద్ద స్థావరం ఏర్పరిచి స్వాతంత్య్ర సమరయోధుల క్యాంపు ఇంచార్జ్‌గా ఆయుధ శిక్షణను ఇచ్చారు. చంద్రగిరి క్యాంపును ఒక బలమైన ఉద్యమ దూర్గంగా రూపుదిద్ది. నిజాం పోలీసు, మిలటరీ దళాల పై దాడులు నిర్వహించడంలో ముందున్నారు. సోషలిస్టు పార్టీ నిర్వహించిన ఆహార సరకుల పంపిణీ సత్యాగ్రహంలో పాల్గొని జైలుకు వెళ్లారు. ఖైదీల కనీస సౌకర్యాల సాధన కోసం జైల్లో నిరాహార దీక్ష నిర్వహించారు. నిజాం మిలిటరీ అవినీతి కార్యక్రమాలకు నిలయమైన హన్మకొండ, విచిత్ర వినోద ప్రదర్శనశాల తగల పెట్టారు. స్వాతంత్య్రానంతరం.. 1952వ సంవత్సరంలో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో ప్రజాస్వామ్యబద్దమైన పీపుల్స్‌ డెమోక్రటిక్‌ ఫ్రంట్‌ అభ్యర్థుల గెలుపు కోసం కృషిచేశారు. పరకాల పట్టణ మున్సిపల్‌ కమిటీ అధ్యక్షులుగా ఎన్నిక, పరకాల పంచాయితీ సమితి ఉపాధ్యక్షులుగా ఎన్నిక, గ్రామాల అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రజలను భాగస్వాములను చేసి, వారి సమస్యల తక్షణ పరిష్కారార్ధం, ప్రభుత్వ అధికారులను గ్రామాలకు రప్పించి అక్కడిక్కడే పరిష్కరించి నిర్ణయాలు తీసుకొనే ప్రత్యక్ష ప్రజాస్వామిక పాలనకు అంకురార్పణ చేశారు. వరంగల్‌ జిల్లా సర్పంచ్‌ల నియోజక వర్గం తరపున గ్రంధాలయ సంస్థాదిపత్యాన్ని స్వీకరించి పలు శాఖా గ్రంధాల విస్తరణకు పాటు బడడమే గాక, పరకాలపట్టణంలో స్వాతంత్య్ర సమరయోధుల స్మారకార్ధం స్వరాజ్‌ భవన్‌ ను నిర్మించి అమర వీరుల గ్రంధాలయం పేర గ్రంధాలయ స్థాపన, ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో ప్రముఖ పాత్రను నిర్వహించారు. పిడి చట్టం క్రింద అరెస్టయ్యారు. 1962 నుండి 1982 వరకు ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుల ఉత్తమ పత్రికారచయిత, అభినవ అరిస్టాటిల్‌ గా భావించబడే కీ.శే పాములపర్తి సదాశివరావు గారి మార్గదర్శకత్వంలో విశ్వజ్యోతి మాస పత్రిక ముద్రణ, సంపాదకత్వ నిర్వహణ, సాంస్కృతిక పత్రికారంగంలో అనుభవం. విశ్వజ్యోతి పబ్లికేషన్‌ ద్వారా గెరిల్లా యుద్ద రీతి పై విప్లవ పోరాటాల అనుభవాలను చైనా దురాక్రమణ పై ప్రచురణల ద్వారా విజ్ఞాన జ్యోతిని వెలగించడం, ప్రభుత్వంచే సాహితి నిషేదానికి గురి కావడం. నాస్థిక వారి గోరా గారు నిర్వహించిన సైద్దాంతిక ఉద్యమం, మంత్రులు ప్రజా సేవపకులుగా సాదారణ జీవితం గడపాలన్న నినాదాన్ని ప్రతిధ్వనింప చేయడంలో ప్రముఖ పాత్రను పోషించారు. ప్రజాస్వామిక విలువలనాధారం చేసుకొని, ఎన్నో సార్వత్రిక ఎన్నికల్లో ప్రాతినిధ్య బాధ్యతలను పంచుకోవడం, ప్రజల్లో ప్రజాస్వామిక చైతన్యం తీసురావడానికికై ఎన్నికల విధానాల సవరణ కోసం కృషి సల్పడం. ఓటెసెటప్పుడే ఉండాలి బుద్ది యఅన్న కాళోజీ సూక్తికి ప్రాణం పోసే బాద్యతతో వరంగల్‌ జిల్లాలోని మెట్లపల్లి గ్రామంను ప్రజాస్వామ్యానికి సరైన నిర్వచనంగా ప్రజలను చైతన్య పరచడం, అభ్యర్థులను నిర్ణయించేది. గెలిపించేది ఓటర్లే గాని, రాజకీయ పార్టీలు కాదని అన్న జ్ఞానాన్ని ప్రజల్లో కలిగించడానికి విస్త్రుత ప్రచారం కొనసాగించడం. స్వతంత్య్ర సమరయోధుల సన్మాన పెన్షన్‌ల కోసం వారి ఆత్మాభిమానాన్ని కాపాడడానికై నిరంతరం శ్రమిస్తూ స్వాతంత్య్రర సమరయోధుల జాతీయ సభాధ్యక్షులుగా పదవీ బాధ్యతలను నిర్వహించడం, వందల మంది స్వాతంత్య్ర సమరయోధుల పెన్షన్‌ సౌకర్యం కలిగించడానికి పలు కార్యక్రమాలు నిర్వహించారు. నర్సింహా రెడ్డి మృతి పట్ల ఎపియుడబ్ల్యూజె వరంగల్‌ శాఖ, వారసుల సంఘం అధ్యక్షులు డాక్టర్‌ జయపాల్‌ రెడ్డి తదితరులు నివాళ్ళర్పించారు.

Leave a Reply