***
నేటికి ఆరేండ్లు…
నిలబడింది నిట్ట నిలువుగా
స్ఠిరపడింది నిలకడగా
సారించింది అడుగులు ముందుకు
సాగించింది పయనం అభివృద్ధి దిశగా
అలనాటి వెకిలి నవ్వుల ముఖాలు
నేడు వెలవెల బోయేలా
వెలుగులు విర జిమ్ముతూ ఆకాశ భారతంలో
ధృవ నక్షత్రమయింది మన తెలంగాణా
చీకటెరుగని విద్యుత్ కాంతులు
నిత్యం ఆగని విరజిమ్ములు
తప్పిన నీటి బిందెల మోతలు
నిత్యం కురిపించిన నీటి ప్రసరణలు
పెరిగిన రక్షణ వ్యవస్థ
స్త్రీలకు ప్రత్యేక షీ టీముల ఆసరా
కనబడని రౌడీలు గుండాల ముఖాలు
తగ్గిన ముఠాల కొట్లాటలు
రైతు అన్నల బ్రతుకులకు భీమా
ఇచ్చింది వారిమెంతో ధీమా
విద్యలో పెరిగింది ప్రభుత్వ విధానం
ప్రైవేట్ వ్యవస్థకు నేర్పిన మంచి పాఠం
పైకెక్కి నిలబడిన కాళేశ్వరం
సాగు నీటికి ఒక వరం
కాకతీయ చెరువుల నింపు
తాగు నీటికి ఆడ బిడ్డల కొక ఇంపు
ఇప్పటి సింగరేణి నల్ల బంగారం
ఇంద్రధనుస్సు రంగుల కాంతుల సమూహం
ఒకప్పటి నిత్య కొట్లాటల నిలయం
నేటి ప్రశాంత హైదరాబాదు వాతావరణం
ఇపుడిప్పుడే బుడి బుడి అడుగులేస్తున్నా
ప్రతి అడుగూ సరి ఐన దిశలో
అందరినీ తలదన్నే తగు వేగంతో
ఎప్పుడూ నిలుపుకుంటూ ఒకటవ స్ఠానాన్ని స్ఠిరంగా
అందుకే అందాం అందరం
జయ తెలంగాణా
దిగ్విజయ తెలంగాణా
సాగు సాగు ముందుకు
మా తోడుంటుంది అందుకు
***
(జూన్ 1, 2020 లో రాసిన కవిత)
శ్రీమతి పాములపర్తి చంద్రకీర్తి