Kakatiya Patrika

Posts under ‘చలసాని ప్రసాదరావు’

ఓ ఏడాది తర్వాత చలసాని ప్రసాదరావు ”కబుర్లు”

Courtesy: Eenadu
ఎన్ని మాటల్లో ఎంతగా చెప్పుకొన్నా ”సెల్ఫ్‌మేడ్‌ మ్యాన్‌” అన్న పదబంధం అర్థమైనంత స్పష్టంగా మరోమాట అర్థంకాదు. దీనికి ఉదాహరణ – చలసాని ప్రసాదరావు. చిత్రకళ, ఛాయా చిత్రకళ, జర్నలిజం, రచన, సంపాదకత్వం, విమర్శ, కార్యనిర్వహణ… ఇవన్నీ ఆయన ముఖాలు. ఆయన వామ’పక్ష’పాతి. నిర్మొహమాటి. తలవంచని జర్నలిస్టు. మిత్రుల్ని ప్రేమిస్తూనే వారిలోని ఆరాచకత్వాన్ని, అమానవీయ విలువల్ని తూర్పారబట్టే నిష్పక్షపాతి.కళాసాహిత్యాల్ని చివరివరకూ ప్రేమించి రాశిలోనూ వాసిలోనూ గణనీయమైన కానుకల్ని గర్వంగా అందించిన వ్యక్తి.